విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో రద్దీ తగ్గింది. కొవిడ్ మృత దేహాలతో పాటు వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి అంతిమసంస్కారాలు ఇక్కడే చేయడం వల్ల కొద్దిరోజులు రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో పది నుంచి 15 మృతదేహాలు మాత్రమే ఇక్కడకు వచ్చేవి.
గత మూడు వారాలుగా ఈ సంఖ్య దాదాపు పదింతలు పెరిగింది. సగటును వంద వరకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లోనూ ఇప్పుడు అంత్యక్రియలకు అనుమతించడంవల్ల జ్ఞానాపురం శ్మశాన వాటికపై ఒత్తిడి తగ్గింది.
ఇదీ చదవండి: