
విశాఖలోని ఎంవీపి కాలనీ రైతు బజార్‌ను జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజారు నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పరిశీలించారు. నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్టేట్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సమస్యలు అడిగి తెలుసున్నారు. వాటి పరిష్కారానికి సత్యరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుబజారు రికార్డులను, కూరగాయల ధరలను పరిశీలించారు.

పారిశుద్ధ్య నిర్వహణపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుబజారును శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారిని హెచ్చరించారు. రైతు బజారులో జరుగుతున్న అభివృద్ది పనులను తొందరగా పూర్తిచేయాలని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను ఆదేశించారు. రైతుబజారు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలు రాకుండా చూసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: