ఆంధ్రా-ఒడిశా సరిహద్దు.. జోలాపుట్ వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నారు. బీఎస్ఎఫ్కు చెందిన 15వ బెటాలియన్ బలగాలు పహారా కాస్తున్నారు. ఈ బెటాలియన్‌కు చెందిన ఇంద్రసింగ్ అనే జవాన్ శనివారం ఉదయం విధులు నిర్వహిస్తూ.. తన సర్వీస్ రివాల్వర్‌తో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి జవాన్లు.. సమీపంలో గల లమతపుట్ ఆశాకిరణ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఇంద్రసింగ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
సెలవుపై స్వస్థలానికి వెళ్లి వచ్చిన జవాన్..
ఆత్మహత్యకు పాల్పడిన జావాన్ ఇటీవలే నెలరోజులు సెలవుపై స్వస్థలమైన రాజస్థాన్‌లోని జానిబడికి వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు.
ఇదీ చదవండి:
విశాఖ: కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు