విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ సర్పంచ్ వంతాల లలిత (38) గుండెపోటుతో మృతి చెందారు. గుండెనొప్పి రావడంతో ఆమెను ముంచింగిపుట్టు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. సీపీఎం తరపున లలిత రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహానికి సీపీఎం మండల కార్యదర్శి కొర్రా త్రినాథ్ నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి. దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ