విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కొందరికి అర్హత ఉన్నా... జగనన్న చేదోడు పథకం అందట్లేదు. దీంతో అర్హత కలిగిన రజకలు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీడికాడ మండలంలోని తురువోలు గ్రామానికి చెందిన తెడ్లపు పోతురాజు చాలా ఏళ్లుగా దర్జీ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు చేదోడు పథకం అందలేదు. ఈ విషయంపై చీడికాడ ఎంపీడీఓ జయప్రకాశరావుకు ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా.. రాజకీయ అండదండలతో చాలా మందికి చేదోడు మంజూరు చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్జునగిరిలో రజకలు కులవృత్తి నమ్ముకుని జీవిస్తున్న కొందరికి జగనన్న చేదోడు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు