'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం' - interview with anakapalle mp
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి పనిచేస్తామని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి సత్యవతి తెలిపారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో విజయబావుటూ ఎగర వేస్తామన్నారు. తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జీవీఎంసీ కార్పొరేట్ స్థానాలు 5 కూడా మహిళలకు రావడం వల్ల విజయానికి కృషి చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆమె ఈటీివీ భారత్తో మాట్లాడారు.