ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజెఎం) అవగాహన ఒప్పందం చేసుకుంది. అవగాహనలో భాగంగా... మానవ హక్కుల అమలు, నిర్భంద కార్మికులు, మానవ అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై కలిసి పనిచేయనున్నారు. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఐ.జె.ఎం. సీనియర్ అసోసియేట్ శాంసన్ డేనియల్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇవీ చూడండి...