ETV Bharat / state

ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం - విశాఖజిల్లాలో ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాల వార్తలు

విశాఖ జిల్లాలో ఏపీ ఆదర్శపాఠశాల / కళాశాలలో 2020-21 ఏడాదికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హీరాలాల్ వెల్లడించారు.

Inter Admissions in the   model schools
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
author img

By

Published : Jul 16, 2020, 11:53 AM IST

విశాఖ జిల్లాలో ఏపీ ఆదర్శ పాఠశాల/ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని చీడికాడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హీరాలాల్ వెల్లడించారు. ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయని, ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు. ఒక్కో గ్రూపులో 20 సీట్ల వరకు ఖాళీలు ఉంటాయని చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా వసతిగృహం ఉంటుందన్నారు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఓసీ, బీసీ రూ.150, ఎస్సీ, ఎస్టీ రూ.వంద చలానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలకు ఆన్​లైన్​లో దరఖాస్తు గడువు ఈ నెల 30 తేదీ వరకు ఉందని చెప్పారు. ఈ తరహా ఏపీ ఆదర్శ పాఠశాలలు విశాఖ జిల్లాలో చీడికాడ, నర్సీపట్నం, కసింకోట, రావికమతం, మునగపాక మండలాల్లో ఐదు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులు www.apms.ap.gov.in, www.cse.ap.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఇదీ చూడండి. సీఎం జగన్​కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.