విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గోలుగొండ, కొయ్యూరు, నాతవరం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఓ పక్క మద్యం షాపులపై పర్యవేక్షణ చేస్తూనే.. మరోపక్క గంజాయి అక్రమ రవాణా, నాటు సారా తయారీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి సుమారు 182 వాహనాలు నిలిచిపోయాయి.
వాస్తవానికి కేసుల్లో పట్టుబడిన వాహనాలను.. వాటి యజమానులు కోర్టుకు పత్రాలు సమర్పించి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కానీ... ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎవరూ వాహనాలు తీసుకువెళ్లేందుకు ముందుకు రావడంలేదు. వీటిపై పడుతున్న దుమ్ము, ధూళి.. కార్యాలయంపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు.. వేలం వేయాల్సిన అధికారులు.. కోర్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. అప్పటి వరకూ వేలం వేయలేమని తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి యరపతినేని సహా... 12మందిపై కేసు నమోదు