Rowdy Sheeters in Visakhapatnam: "జగన్ పాలనలో.. విశాఖను అరాచకశక్తులకు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ అధికారపార్టీ నాయకులే భూ దందాలు, మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారు".. ఇదీ ఈనెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్య.! అమిత్‌షా వ్యాఖ్యలు వైసీపీ నేతలకు కోపంతెప్పించాయిగానీ.. ఆయన చెప్పిన మాటలు మాత్రం మూడురోజులు తిరగకముందే నిజమనినిరూపించాయి.
సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, భార్య కిడ్నాప్ ఉదంతం సాగర నగరంలో నేరమాఫియా బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. విశాఖ అంటేనే.. ప్రశాంతతకు, ఆహ్లాదానికి చిరునామా.! అలాంటి నగరంలో.. గత నాలుగేళ్లుగా అసాంఘిక శక్తులు పేట్రేగుతున్నాయి. రౌడీషీటర్ల దందాలు.. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందనే విమర్శలకు.. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఊతమిచ్చింది.
జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదు: అమిత్ షా
రాష్ట్రంలోని అతి పెద్ద స్థిరాస్తి వ్యాపారుల్లో ఒకరు.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఏటా వందల కోట్ల టర్నోవర్ కలిగిన పెద్ద బిల్డర్.! జీవీగా పేరుపొందిన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పలు స్థిరాస్తి ప్రాజెక్టుల్లో భాగస్వామి. హయగ్రీవ భూముల వివాదంలోనూ ఆయన ప్రమేయం ఉంది. అధికార పార్టీలో.. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తర్వాత విశాఖలో.. ఈ ఇద్దరే అత్యంత ప్రముఖులు. ఆడిటర్ జీవీ.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని చెప్తుంటారు. అలాంటి వ్యక్తుల్ని నేర ముఠా నిర్బంధించి కోట్ల రూపాయలు వసూలు చేసుకునే స్థాయికి విశాఖ శాంతిభద్రతలు క్షీణించాయి.
విశాఖ అరాచకాలకు అడ్డాగా మారిందనే ఆందోళన.. కొన్నాళ్లుగా వివిధ వర్గాల్లో ఉంది. వైసీపీ నాయకులే పాముకు పాలు పోసి పెంచినట్లు నేర ముఠాలను ప్రోత్సహించడం.. శాంతిభద్రతల్ని దిగజారుస్తోంది. రౌడీషీటర్లు ఏ అధికారంలోకి వచ్చాక విశాఖను ఆర్థిక రాజధాని అంటూ ప్రచారం చేయడం, అధికారపార్టీ పెద్ద తలలు, వేరే ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌లు గద్దల్లా వాలేలా చేశాయి. విలువైన భూములు.. వివాదాస్పద స్థలాలపై కన్నేసి వాటిని గుప్పిటపట్టాయి. కొన్ని భూములపై వివాదాలూ.. సృష్టించాయి.
Amit Shah Speech: రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం.. జగన్ సిగ్గుపడాలి.. : అమిత్ షా
గత నాలుగు సంవత్సరాలలో అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిన.. భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇలా భూములు చేతులు మారటం వెనక.. పనిచేసింది బెదిరింపులు, ఒత్తిళ్లే.! ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నాయకులే పాముకు పాలు పోసి పెంచినట్లు నేర ముఠాలను ప్రోత్సహించడం.. శాంతిభద్రతల్ని దిగజారుస్తోంది. రౌడీషీటర్లు ఏ నాయకులు.. పలువురు రౌడీషీటర్లు, నేరగాళ్లనూ ప్రోత్సహించారు. కొందరైతే.. ఆయా ప్రాంతాల్లోని అధికారపార్టీ నాయకుల అనుచరులుగా పెత్తనం చెలాయిస్తున్నారు.
విశాఖ నగరంలో.. క్రిమినల్ గ్యాంగ్‌ల సంస్కృతి పెరుగుతోంది. దండుపాళ్యం, ఖాసిం గ్యాంగ్, హైపర్‌బోయ్స్, త్రీస్టార్ గ్యాంగ్, చిట్టిమాము.. వంటివి క్రియాశీలకంగా ఉంటున్నాయి. చిట్టిమాము ప్రత్యర్థి ఖాసిం హత్యకు గురైనా, అతని అనుచరవర్గం మాత్రం చురుగ్గానే ఉంది. చిట్టిమాము - ఖాసిం గ్యాంగ్‌ల మధ్య వార్ నడుస్తోంది. చిట్టిమాము తన చుట్టూ.. నిత్యం ఆరుగురు బౌన్సర్లను తనకు రక్షణగా పెట్టుకుని తిరుగుతాడని పోలీసులే గుర్తించారు. ఇటీవల కొత్తగా తెరపైకి వచ్చిన ‘హైపర్ బాయ్స్’ గ్యాంగ్ కత్తులు, పలు మారణ ఆయుధాలతో బెదిరిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతోంది.
MP Family Kidnap: విశాఖలో ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, నేరాలు, సెటిల్‌మెంట్లతో ఈ గ్యాంగులు సొమ్ములు.. సమకూర్చుకుంటున్నాయి. విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. కోలా వెంకట హేమంత్‌కుమార్‌కూ.. పెద్ద నేర చరిత్రే ఉంది. అతనిపై.. 12 కేసులున్నాయి. చివరిగా అతనిపైన నమోదైన మూడూ కిడ్నాప్ కేసులే. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధురవాడ పరిధిలోఓ రౌడీషీటర్ డబ్బు కోసం.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. గతేడాది జూన్‌లో పాసి రామకృష్ణ అనే స్థిరాస్తి వ్యాపారిని కొందరు రౌడీషీటర్లు బంధించి, మెడపై కత్తిపెట్టి బెదిరించి.. రూ.కోటి డిమాండు చేశారు. అప్పట్లోనే ఆ ఘటన భయాందోళన సృష్టించింది.
విశాఖలో.. 350 నుంచి 400 మంది వరకూ రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో వంద మంది హత్య కేసుల్లో నిందితులు. హత్యలు, సెటిల్‌మెంట్లు, ఇతర నేరాల్లో వారి ప్రమేయం ఉంటోంది. ప్రాంతాలవారీగా పంచుకుని పంచాయితీలు చేస్తున్నారు. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల సరఫరా, బెట్టింగ్‌ల నిర్వహణలో.. వీరి ప్రమేయం ఉంటోంది. ఈ గ్యాంగ్‌లపై, వాటిని నడిపించేవారిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండటం లేదు. దీంతో నేరాల్లో వారి ప్రమేయం అధికమవుతోంది.
Pendurthi Land Issue: విశాఖలో రౌడీ మూకల బరితెగింపు.. మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి హల్చల్
అరాచకశక్తుల పీఛమణచడంలో విఫలమవుతున్న పోలీసులు.. రాజకీయ పోలీసింగ్‌లో మాత్రం రాటుదేలారు. వైసీపీ నాయకులే పాముకు పాలు పోసి పెంచినట్లు నేర ముఠాలను ప్రోత్సహించడం.. శాంతిభద్రతల్ని దిగజారుస్తోంది. రౌడీషీటర్లు ఏ నాయకుల సేవలో.. తరిస్తూ గిట్టనివారిపై కేసులు పెట్టడం, విపక్ష నేతలను నిర్బంధించటమే.. తమ విధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గస్తీని మొక్కుబడిగా మార్చేశారు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. నాలుగేళ్లుగా విశాఖలో నేరాల తీవ్రత పెరుగుతోంది. భూ మాఫియా వేళ్లూనుకుంటోంది. భూకబ్జాకోరులపై గతంలో రౌడీషీట్లు తెరిస్తే.. ఇప్పుడు వారికి అండదండలు అందిస్తున్నారు.
వైసీపీ నాయకులే పాముకు పాలు పోసి పెంచినట్లు నేర ముఠాలను ప్రోత్సహించడం.. శాంతిభద్రతల్ని దిగజారుస్తోంది. రౌడీషీటర్లు ఏ అధికారంలోకి.. వచ్చాక భూ వివాదాలపై విచారణ కోసం.. ‘ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం-ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఇప్పటికే.. వేలల్లో ఫిర్యాదులు అందాయి. కానీ కేసులు మాత్రం పదుల సంఖ్యలోనే.. నమోదయ్యాయి. కేసు నమోదు చేయదగ్గ ఫిర్యాదులకూ సివిల్ వివాదాల ముద్ర వేసి.. కోర్టులోనే తేల్చుకోవాలని పంపేస్తున్నారు. ఈ ఉదాసీనతే కబ్జాదారులకు అవకాశంగా మారింది.