రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే పాడేరు ఘాట్ రోడ్లో అమ్మవారి విగ్రహం, పాదాలు విరగ్గొట్టారు. రెండు రోజుల కిందటే అమ్మవారి పాదాలు పగుల కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘాటి కొండ మలుపులో ఉండే ఈ అమ్మవారికి.. చుట్టుపక్కల నాలుగు పంచాయతీల్లోని ముప్పై గ్రామాల ప్రజలు మెుక్కులు తీర్చుకుంటారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ధ్వంసం