విశాఖ జిల్లా గొలుగొండ మండలం జోగింపేటలో విద్యుదాఘాతంతో అచ్చియ్యనాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని సాలికమల్లవారం గ్రామానికి చెందిన ఆయన... జోగింపేటలో ఇంటి నిర్మాణంలో కూలీ పనికి వెళ్లాడు. పనులు చేస్తోన్న సమయంలో ఇంటిపై విద్యుత్తు తీగలు అతనికి తగిలాయి. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్న కొద్దిసేపటికే అచ్చియ్యనాయుడు మృతి చెందాడు. గొలుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కరోనాను జయించిన 4 నెలల పసికందు