రామతీర్థం ఘటనపై ప్రభుత్వం నియమించిన సీఐడీ అధికారిని మార్చాలని హిందూ సంఘాల నాయకులు విశాఖలో డిమాండ్ చేశారు. హిందూ మనోభావాలకు సంబంధించిన సున్నితమైన సమస్యపై ఒక క్రిస్టియన్ అధికారిని నియమించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ అధికారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనను తప్పించి మరొకరికి విచారణ బాధ్యత అప్పగించాలని కోరారు.
అధికార, ప్రతిపక్ష నాయకులు రామతీర్థాన్ని.. రాజకీయ తీర్థంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇదీ చదవండి: ఆలయాల మీద దాడులపై కేంద్రమంత్రి అమిత్‌షాకు జీవీఎల్ ఫిర్యాదు