విశాఖ జిల్లా ఎలమంచిలి సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారిపై నిలిచిపోయిన లారీ డ్రైవర్లకు హిజ్రాలు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించగా... దూరప్రాంతాలకు వెళ్లే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలు పెట్రోల్ బంకులు వద్ద వీటిని నిలిపివేశారు. హోటళ్లు మూసివేయడంతో వీరికి తిండి కరువైంది. లారీ డ్రైవర్ల కష్టాలు అర్థం చేసుకున్న హిజ్రాలు సొంతంగా బిర్యానీ తయారు చేసి పోలీసుల సాయంతో వారికి పంపిణీ చేశారు. హిజ్రాల చేపట్టిన ఈ మంచిపని అందరినీ ఆకట్టుకుంది. స్థానిక సీఐ నారాయణ రావు వీరిని అభినందించారు.
ఇవీ చదవండి...'రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్'