విశాఖ జిల్లా కంచెరపాలెం, ఆనందపురంలో గ్రామ సచివాలయాలను ముత్తంశెట్టి, బొత్స సత్సనారాయణ ప్రారంభించారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని.. చేతలలో చేసి చూపించామని మంత్రులు అన్నారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల అభిప్రాయాలను ప్రజలకు తెలిపే కార్యక్రమాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ చేశారు. ఈ సమయంలో వ్యాఖ్యాతగా మారి అభ్యర్థులతో మాట్లాడించారు.
ఆనందపురంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లను పరిశీలించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన చేసిన అనంతరం పౌష్టికాహార విలువలతో కూడిన బాలామృతం ప్యాకెట్లను అందజేశారు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధించాల్సిన కృత్యాధార పరికరాలను ఉపాధ్యాయులు ప్రదర్శించారు మేళతాళాలు డప్పులు వాయిద్యాలతో మంత్రికి గ్రామస్తులు, మహిళలు ఆహ్వానం పలికారు తప్పుడుగుళ్ళు, కోలాటాలు సందడి చేశాయి. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
జోరు వర్షంలో... నర్సీపట్నం సచివాలయ ప్రారంభోత్సవం
గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అస్తవ్యస్తమైంది. ప్రారంభం తర్వాత బహిరంగ సమావేశం ప్రారంభమయ్యే సరికి వర్షం ఆటంకపరిచింది. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతుండగా జోరుగా వర్షం కురవటంతో సభ అర్ధాంతరంగా ముగిసింది.
ఇవీ చదవండి