విశాఖ జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు కాస్త వేడి గాలుల నుంచి ఉపశమనం పొందారు.
ప్రధానంగా రావికమతం మండలం కొత్తకోట, రోలుగుంట, అడ్డసరం, భోగాపురం, దొండపూడి, కొవ్వూరు, కె నాయుడు పాలెం తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. నర్సీపట్నం, చోడవరం రహదారిలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: