ETV Bharat / state

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్​ నుంచి విక్టర్ అవుట్.. ఆ ఆరోపణలే కారణం.. - andhra pradesh news

GYV Victor was Completely Removed from the Company: విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) లిమిటెడ్‌ ఎండీ, సీఈవోగా ఇంత వరకు సస్పెన్షన్‌లో ఉన్న డాక్టర్‌ జీవై విక్టర్‌ను సంస్థ నుంచి పూర్తిగా తొలగించారు. నకిలీ ధ్రువపత్రాలతో పోస్టుకు ఎంపికయ్యారంటూ విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికతో గతంలో విక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.

DCO
డీసీఐ
author img

By

Published : Apr 1, 2023, 10:51 PM IST

GYV Victor was Completely Removed from the Company: విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐ) సంస్ధ సీఈవో, ఎండీగా ఇంత వరకూ సస్పెన్షన్‌లో ఉన్న డాక్టర్‌ జీవైవీ విక్టర్​ను శాశ్వతంగా ఆ పదవి నుంచి, సంస్ధ నుంచి తొలగిస్తూ కమిటీ నిర్ణయించి అమలుకు ఆదేశాలిచ్చింది. గతేడాది సస్పెన్షన్​కి గురైన విక్టర్ పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై నిగ్గుతేల్చిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను ఉన్నత స్దాయి కన్సార్టియం కమిటీ పరిశీలించి వాటిని నిర్ధారించుకుంది.

దీనిపై ఆయన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించడంతో కన్సార్టియం ఛైర్మన్​గా ఉన్న విశాఖ పోర్టు అధారిటీ ఛైర్మన్ కె. రామ్మోహనరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధగా ఒకప్పుడు డీసీఐ ఉండేది. దానిని ప్రయివేటీకరణ చేసేందుకు నిర్ణయించిన తర్వాత పెద్ద ఎత్తున అందోళనలు చోటు చేసుకోవడం, ఒక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడడం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంపై పెద్ద ఎత్తున తెచ్చిన ఒత్తిడి తెచ్చారు. దీంతో అన్నీ ఫలించి డీసీఐని పోర్టుల కన్సార్టియంకి కేంద్రం అప్పగించింది.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఇది మనుగడ సాగిస్తోంది. దీనికి తొలి ఎండీ, సిఈవోగా డాక్టర్ జీవైవీ విక్టర్​ను కమిటీ ఎంపిక చేసింది. తర్వాత ఈయన తన అనుభవానికి సంబంధించిన తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించి ఆ పోస్టుకి ఎంపిక అయ్యారని అభియోగాలను ఎదుర్కొన్నారు. వీటిపై విజిలెన్స్ కూలంకషంగా విచారించి నివేదికను పోర్టు కన్సార్టియం నియమించిన కమిటీకి అప్పగించింది.

విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ఏడాది జూన్‌ 13న విక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఇంఛార్జ్ ఎండీ, సీఈవోగా దివాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు. విక్టర్​పై ఆరోపణలు వాస్తవమని తేలడంతో ఆయన్ని శాశ్వతంగా సంస్ధ నుంచి తొలగించాలని కన్సార్టియం నియమించిన కమిటీ నిర్ణయించింది.

కమిటీ నిర్ణయం మేరకు కన్సార్టియంకి ఛైర్మన్ హోదాలో ఉన్న విశాఖ పోర్టు అధారిటీ ఛైర్మన్ ఉత్తర్వులు ఇచ్చారు. దీనితో విక్టర్​ని శాశ్వతంగా డీసీఐఎల్ నుంచి తొలగించినట్టయింది. వీటితో పాటు తప్పుడు విధానాలను డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో అనుసరించారని, అదే విధంగా కంపెనీలో పలు అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు సైతం విక్టర్‌పై గతంలో వచ్చాయి. దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక తవ్వోడల సంస్ధ డీసీఐఎల్ మాత్రమే. ప్రయివేటు వాటితో ఇప్పుడు పోటీ పడాల్సి ఉంటోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.