తెలుగు కనిపించాలి.. తెలుగు వినిపించాలి.. కోర్టులో తీర్పయినా, కలెక్టర్ కార్యాలయంలో ఆదేశాలైనా అన్ని తెలుగులో ఉండాలని జాతీయ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన... తెలుగు భాష గొప్పతనాన్ని, కాపాడుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిన పనిని వివరించారు. న్యాయస్థానంలో వాదనలు తీర్పులు తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన భాషను విరివిగా ఉపయోగించాలన్నారు. సామాన్యుడు వచ్చినప్పుడు వారికి తెలిసిన భాషలో సేవలందించినప్పుడే నిజమైన భాషాభిమానం వ్యక్తమవుతుందన్నారు. ఆంగ్లంలో లాటిన్ పదాలు ఎన్నో ఉన్నాయని అలాగే తెలుగులోనూ చాలా భాషలు మిలితం అయ్యాయన్నారు. అందరూ తెలుగుకు సేవ చేయాలన్నారు.
ఇదీ చూడండి:కర్నూలు వ్యవసాయ మార్కెట్లో భారీగా ఉల్లి నిల్వలు..