దేవరాపల్లి - పినకోట మార్గంలోని అసంపూర్తి వంతెనను వేగంగా పూర్తి చేయాలని.. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ.. ఈటీవీ, ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు ఆయన స్పందించారు.
దేవరాపల్లిలో శారదా నదిపై వంతెన నిర్మాణానికి.. 40 లక్షల రూపాయలకు పైగా నిధుల మంజూరుకు కృషి చేశారు. గతంలో ఉన్న కాజ్ వే కొట్టుకుపోగా.. వంతెనపై రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయంపై.. ఆయన ఈ మేరకు శ్రమించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
ఇదీ చదవండి: