ETV Bharat / state

జీవీఎంసీ పరిధిలో మరిన్ని వాకీటాకీలు - walky talky news

విశాఖపట్నం నగరం విస్తరిస్తుండంతో అత్యవసర సేవలందించే అధికారులు, సిబ్బందికి వాకీటాకీలు అందించనున్నారు. జీవీఎంసీ పరిధిలో 200 వాకీటాకీలు అవసరమని అధికారులు అంచనా వేశారు.

walky talkys
జీవీఎంసీ పరిధిలో వాకీటాకీల సేవలు
author img

By

Published : Nov 6, 2020, 12:20 PM IST

విశాఖపట్నం మున్సిపల్​ పరిధిలో తొంభై ఎనిమిది వార్డులున్నాయి. నగరం విస్తరిస్తుండటంతో అత్యవసర సేవలందించేందుకు సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందికి వాకీటాకీలు అందించనున్నారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో 100 వాకీటాకీలున్నాయి. మరో 200ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటి కోసం రూ.1.03 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, టౌన్‌ప్లానింగ్, మంచినీటి సరఫరా, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన విభాగాల్లో ఉన్న సిబ్బందికి వీటి అవసరమెక్కువ. నగరంలో కలిసిన అనకాపల్లి, భీమిలి జోన్లు, మధురవాడ, పెందుర్తి లాంటి శివారు ప్రాంతాల్లో వాకీటాకీ సేవల్లేవు. అక్కడ కూడా ప్రారంభించేందుకు టవర్ల ఫ్రీక్వెన్సీని పెంచేందుకు ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.