అంతర్జాల సేవలను ప్రజలకు మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ డెవలపర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని గూగుల్ డెవలపర్స్‌తో పాటు చెన్నై, భువనేశ్వర్, కర్ణాటకకు చెందిన సుమారు 300 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అంతర్జాల సేవల్లో సమస్యలు అధిగమించేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులను సుదీర్ఘంగా చర్చించారు. గూగుల్ టాపర్స్ గ్రూప్ చాప్టర్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఈ ఫెస్టివల్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి :