ETV Bharat / state

గ్యాస్ లీకై ప్రమాదం..రూ.60వేల ఆస్తి నష్టం - విశాఖ మర్రిపాలెంలో అగ్ని ప్రమాదం

విశాఖ మర్రిపాలెం భరత్ నగర్​లో గ్యాస్ లీకై ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. మహిళ గమనించి బయటకు రావటంతో ప్రాణనష్టం తప్పింది. రూ. 60 వేల మేర ఆస్తి నష్టం జరిగింది.

gas leak accident at vishaka marripalem
గ్యాస్ లీకై ప్రమాదం
author img

By

Published : Oct 10, 2020, 8:55 AM IST

విశాఖ మర్రిపాలెం భరత్ నగర్​లో గ్యాస్ లీకై ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఇంటిలోని మహిళ వంట చేసేందుకు గ్యాస్ స్టవ్​ వెలిగిస్తుండగా ప్రమాదం జరిగింది. గ్యాస్ వాసన గమనించి మహిళ బయటకు పరుగు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో రూ. 60 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చేసిందేంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.