విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రామారావు తన సిబ్బందితో కలిసి ఘాట్ రోడ్డు కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 16 ఏళ్ల కుర్రాడిని గుర్తించారు.
అతడు రాజమహేంద్రవరానికి చెందిన యువకుడిగా తెలుసుకున్నారు. అతని వద్ద నుంచి 11.05 కేజీల గంజాయితో పాటు బైకు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.
ఇదీ చదవండి: