విశాఖపట్నం జిల్లా పెద్ద జాలరిపేటకు చెందిన గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితంగా కాకినాడ జెట్టీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం రెండు గంటల సమయంలో చేపల వేటకు వెళ్లిన వీరు... సాయంత్రం వరకు ఇంటికి చేరుకోకపోవటంతో కుటుంబసభ్యులు స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా... గుర్నాథరావు, వీర్రాజు, అచ్యుతరావు, అప్పలరాజు సురక్షితంగా కాకినాడ జెట్టీకి చేరినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఇదీచదవండి.