2016లో తుని వద్ద జరిగిన రైలు దగ్ధం కేసుకు సంబంధించి.. విచారణ నిమిత్తం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఆర్పీఎఫ్ రైల్వే స్టేషన్కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 33 మందిని అధికారులు విచారించారు. కేసు విచారణకు హాజరు కావాలని గత నెలలో ఆర్పీఎఫ్ సిబ్బంది నోటీసు ఇవ్వడంతో పద్మనాభం.. గురువారం విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి..