కరోనా లాక్డౌన్ కాలంలో పేదలకు, వలస కూలీలకు దాతలు తమ వంతు సహాయం అందించి దాతృత్వాన్ని చాటుతున్నారు. తాజాగా...విశాఖ జిల్లా తగరపువలస, భీమిలిలోని కేధరిన్ విద్యాసంస్థల చైర్మన్ ఆలీవర్ రాయ్ కరోనా నివారణ చర్యల్లో భాగంగా వలస కూలీలకు సహాయసహకారాలు అందిస్తున్నారు. కాలినడకన, వివిధ వాహనాలు ద్వారా వెళ్తున్న వలస కూలీలకు తగరపువలస వై జంక్షన్ దగ్గర ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి కనీసఖర్చులు లేనివారికి, వెళ్లటానికి చెక్ పోస్ట్ పోలీసుల సహాయంతో లారీలు, బస్సులు ఎక్కించి ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపిస్తున్నారు.
ఇదీ చదవండి