రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరంలో 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే మత్స్యకారులు రింగు వలలను ఉపయోగించాలని నిర్ణయించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కొంత కాలంగా మత్స్యకారుల మధ్య రింగు వలల వాడకంలో వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఆ సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారని విశాఖలో తెలిపారు. 8 కిలోమీటర్ల వరకు యాంత్రీకరణ వేటకు వీలులేదనే నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల మత్స్యకారులు అంగీకరించారని చెప్పారు. మత్యకారుల సమస్యల పరిష్కరం కోసం నిపుణులతో ఓ కమిటీ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: