విశాఖ జిల్లా పరవాడ పెద్దచెరువులో ఫార్మావ్యర్థాల కారణంగా చేపలు మృత్యువాడ పడుతున్నాయి. 40 ఎకరాలు విస్తీర్ణమున్న ఈ చెరువు కింద 110 ఎకరాలు సాగవుతోంది. వ్యర్థాలు కలవడం వల్ల ఆ భూములు కలుషితమై సాగుకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ చాలా సార్లు అధికారులకు నివేదించామని.. పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఫార్మా వ్యర్థాలతో కలుషితం అవుతున్న చెరువును పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Fake Stickers: వాహనాలపై ఫేక్ స్టిక్కర్స్..తనిఖీల్లో విస్తుపోయే నిజాలు!