ETV Bharat / state

AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు - sog

Counterfiring between maoists and police at Andhra Pradesh and Odisha Border...maoists shelter destroyed
ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు...శిబిరం ధ్వంసం..
author img

By

Published : Sep 16, 2021, 1:10 PM IST

Updated : Sep 16, 2021, 4:28 PM IST

13:04 September 16

Counterfiring between maoists and police at Andhra Pradesh and Odisha Border...maoists shelter destroyed

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్ప‌ుల్లో భద్రతాదళాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశాయి. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్​గిరి, కోరాపుట్ జిల్లాల సరిహద్దులోని బడిలికొండపై ఒక పెద్ద మావోయిస్టు శిబిరం ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌వోజీ, డీవీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు మల్కన్ గిరి ఎస్పీ ప్రహల్లాద్ మీనా తెలిపారు. బుధ‌వారం రాత్రి బ‌ల‌గాలు మావోయిస్టుల శిబిరాన్ని చేరుకున్నది గమనించిన మావోలు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా వారిపై ప్రతిదాడులు చేశారు. సుమారు రెండు గంటలపాటు మావోయిస్టుల‌ు, పోలీసుల‌ మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు.  

మావోయిస్టులు కాల్పులు జ‌రుపుకుంటూ చీకట్లో శిబిరం నుంచి త‌ప్పించుకునిపోయారని మీనా వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు అగ్ర‌నేత, ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ స‌భ్యుడు జాంబ్రి అలియాస్ చెల్లూరి నారాయ‌ణ అలియాస్ సురేష్ అలియాస్ బాల‌కృష్ణ త‌ప్పించుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్ప‌ుల నుంచి త‌ప్పించుకున్న మావోయిస్టులు పొరుగునే ఉన్న ఆంధ్రాలోకి పారిపోయార‌ని ఒడిశా పోలీసులు వివరించారు. దీంతో ఏపీ పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు తెలిపారు. ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో త‌ప్పించుకున్న మావోయిస్టులు కోసం ఉమ్మ‌డి గాలింపు నిర్వ‌హిస్తున్న‌ట్లు మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు.  

మావోయిస్టుల శిబిరం నుంచి ఒక తుపాకీ, 6 లైవ్ కాట్రిడ్జ్‌లు, 4 డిటోనేటర్లు, 2 వాకీ-టాకీ, 11 నక్సల్ కిట్లు, యూనిఫామ్‌లు, పోస్టర్‌లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.  

ఇదీ చదవండి :  ఊటపల్లిలో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు

Last Updated : Sep 16, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.