ETV Bharat / state

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం - గంటల తరబడి శ్రమించిన ఫైర్ సిబ్బంది

Fire Accident in Visakha District: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుస్తుల దుకాణంలో చిన్నపాటి పొగతో ప్రారంభమైన ప్రమాదం.. ఉద్ధృతమవ్వటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Fire_Accident_in_Visakha_District
Fire_Accident_in_Visakha_District
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 12:07 PM IST

Fire Accident in Visakha District: విశాఖ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తగరపు వలస అంబేడ్కర్ జంక్షన్​లో జస్వంత్ దుస్తుల దుకాణంలో ప్రమాదవశాత్తూ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నపాటి పొగతో ప్రారంభమైన ప్రమాదం.. షాప్ షెట్టర్ మూసివేసి ఉండటంతో అగ్ని జ్వాలలుగా మారి భారీగా మంటలు ఎగసిపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్థానిక దుకాణదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire Accident at Clothes Shop in Visakhapatnam: అయితే సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఉద్ధృతమవ్వటంతో అధికారులు.. విశాఖ, విజయనగరం నుంచి మరో రెండు ఫైరింజన్లను రప్పించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటంతో.. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్నిప్రమాదం కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు - సీసీ టీవీ దృశ్యాలు విడుదల

Tagarapuvalasa Fire Accident: గంటల తరబడి శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చిట్టివలస ఫైర్​ స్టేషన్​లో ఫైరింజన్ల సంఖ్యను పెంచాల్సి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టకాలంలో విజయనగరం, విశాఖ నుంచి మరో రెండు ఫైరింజన్లతో పాటు స్థానిక ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Huge Fire Accident in Vizag: ఈ అగ్ని ప్రమాదంలో మూడంతస్తుల భవనంలోని దుస్తుల దుకాణం పూర్తిగా దగ్ధమైంది. దీంతోపాటు అగ్ని ప్రమాదానికి దగ్ధమైన చుట్టుపక్కల దుకాణాలకు కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. డీసీపీ కే శ్రీనివాసరావు, ఏసీపీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical Short Circuit)తో జరిగిందా..? లేక జ్వాలా పౌర్ణమి(Jwala Pournami) సందర్భంగా దీపం వెలిగించి.. దుకాణం షెట్టర్ మూసివేయటం వలన మంటలు చెలరేగాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సిగరెట్​ వల్లే ఫిషింగ్​ హార్బర్​లో అగ్ని ప్రమాదం: విశాఖ సీపీ రవిశంకర్​

"ఈ భారీ అగ్ని ప్రమాదంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటలు తరబడి శ్రమించాల్సి వచ్చింది. చిట్టివలస ఫైర్​ స్టేషన్​లో ఫైరింజన్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కష్టకాలంలో విజయనగరం, విశాఖ నుంచి మరో రెండు ఫైరింజన్లతో పాటు స్థానిక ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారుల దీనిపై స్పందించి.. ఫైరింజన్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం." - స్థానికులు

జీవితాలను చిన్నాభిన్నం చేసిన ప్రమాదానికి కారణాలు ఏంటి? - వారిని ఆదుకునేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.