ETV Bharat / state

బ్యాంక్​లో అగ్ని ప్రమాదం.. మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది - fire accident in andhra bank news

విశాఖలోని పూర్ణా మార్కెట్​ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident
అగ్ని ప్రమాదం
author img

By

Published : May 9, 2021, 3:46 PM IST

విశాఖలోని పూర్ణా మార్కెట్​ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్​లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్​ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి.. దట్టమైన పొగలు అలుముకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపు చేశారు. బ్యాంకులో క్యాష్​ ఇచ్చే అధికారి కూర్చునే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో.. విధుల్లో ఎవరూ లేరు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇదీ చదవండి:

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.