ETV Bharat / state

'వైఎస్​ఆర్​ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు' - vishakhapatnam news updates

వైఎస్ రాజశేఖర్​రెడ్డి హయాంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Farmer Minister bandaru narayana moorthi demond to Enquiry With CBI Officers on plats districbution
ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం గురించి మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు నారాయణ మూర్తి
author img

By

Published : Jul 8, 2020, 8:18 PM IST

రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్​ఆర్ హయాంలోనే రద్దు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశాఖపట్నంలో తెదేపా జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జరిగిన అవకతవకల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారన్న విషయాన్ని సీఎం జగన్ తెలుసుకోవాలని అన్నారు.

తెదేపా హయాంలో పూర్తయిన ఏడు లక్షల ఇళ్లకు నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. భూసేకరణ, అసైన్డ్ భూముల విషయంపైనా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి: స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.