విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. విజయవాడ- విశాఖపట్నం 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు, కార్మికులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. ఒక్కసారిగా జరిగిన తోపులాటలో అర్జున్ రావు రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సుభద్రంపేట చెందిన రైతుగా గుర్తించారు.
ఇదీ చదవండి..
Credai property show: నేటి నుంచి.. క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శన