రైతులకు మంచి చేసేందుకే భాజపా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... వ్యవసాయ చట్టాలపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కర్షకులకు కనీస మద్దతు ధరపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఎక్కడైనా పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ఈ చట్టాలు కల్పిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
దళారులు, రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసమే మంగళవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారని భాజపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఈ చట్టాలలోని సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. గుంటూరులో నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.
ఇదీ చదవండి