విశాఖ జిల్లాలో కరోనా కేసుల వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వివరాలు చెప్పకపోవడం వల్ల అయోమయం నెలకొందన్నారు. వివరాలు వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి గోప్యంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కసింకోట మండలంలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధరించినా అధికారికంగా ప్రకటించకపోవడం దారుణమన్నారు.
ఇదీ చూడండి కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'