ETV Bharat / state

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు' - తెదేపాపై దాడి వీరభద్రరావు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం తగదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు.. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు హితవు పలికారు. గత ప్రభుత్వం విశాఖకు చేసిందేమీ లేదని ఆయన అనకాపల్లిలో విమర్శించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయటం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా విమర్శలు మాని... సీఎం జగన్​ను అభినందించాలని సూచించారు.

DHADI VEERABHADRA RAO
'సభ్యత లేని భాషతో విమర్శించటం నీకు తగునా?'
author img

By

Published : Feb 8, 2020, 11:51 PM IST

Updated : Feb 9, 2020, 10:25 AM IST

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు'

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు'

ఇవీ చూడండి:

'అర్హులకు అయిదు రోజుల్లో బియ్యం కార్డులు'

Intro:Ap_vsp_47_08_maji_mantri_dadi_coments_ayyanna_ab_AP10077_k.Bhanojirao_8008574722
సభ్యత లేని భాషతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించడం సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు తగదని మాజీమంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు


Body:గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి చేసిందేమీ లేదని దాడి వీరభద్రరావు చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను
కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖ ప్రాంతం నిర్లక్ష్యానికి లోనవుతుందన్నారు


Conclusion:ఇప్పటికైనా విశాఖ తో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి
చేసేలా ఏం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటే ఉత్తరాంధ్ర వాసులుగా భేషజాలు లేకుండా అంతా జగన్మోహన రెడ్డిని
అభినందించాలని దాడి వీరభద్ర రావు సూచించారు
Last Updated : Feb 9, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.