ETV Bharat / state

పెరిగిన జ్వరాలు.. పట్టించుకోని అధికారులు: మాజీ మంత్రి అయ్యన్న - విశాఖ జిల్లా తాజా వార్తలు

గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రజలు సీజనల్​ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైద్యం అందించాల్సిన ఏఎన్​ఎంలు, ఆశా కార్యకర్తలు, హెల్త్​ వర్కర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

ex minister ayyanna talks about seasonal diseases increased in visakha district
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
author img

By

Published : Aug 25, 2020, 7:15 AM IST

విశాఖ జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నా కలెక్టర్​ సైతం సరైన శ్రద్ధ చూపడం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. గ్రామాల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్​ వ్యాప్తి చెందాయన్నారు. వైద్య సిబ్బంది గ్రామాలకు రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీజనల్​ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే చాలా మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం కింద కేంద్రం నిధులు ఇచ్చినా వాటిని మలేరియా శాఖ వాడుకోకపోవడం వల్ల వేరే శాఖకు మళ్లించారని ఆరోపించారు. నాలుగు లక్షల మందికి దోమతెరలు ఇవ్వాలని కేంద్రం సూచిస్తే ప్రభుత్వం 1.86 లక్షల మందికే ఇచ్చిందన్నారు. మిగతావారికి ఇవ్వకపోవడం వల్ల దోమల కారక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 826 మంది చనిపోయినట్టు ఎన్​ఎంఈపీ సర్వేలో నమోదైందని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా చూడాలని అయన్న కోరారు.

ఇదీ చదవండి :

'అప్పుడు ఎగతాళి చేశారు...ఇప్పుడు మీరేం చేస్తున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.