వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు మరో తుగ్లక్ నిర్ణయని... మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మీటర్లు వద్దని వైఎస్సార్ చెప్తే జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులంతా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు. రైతులపై మోయలేని భారం వేసేందుకు జగన్ పథకం రూపొందించారని ఆరోపించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు వేసే బదులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి ఆ వడ్డీని తానే చెల్లిస్తానని చెప్పిన జగన్... ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించలేదని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 55 శాతం మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్సులు ప్రేవేశపెడితే... ఆ వాహనాలు నిలిపేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు రద్దు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... ఏపీలో 54.96 శాతం పెరిగిన రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు