ETV Bharat / state

సీఎం జగన్ తుగ్లక్ ఆలోచనలు మానుకోవాలి: అయ్యన్న

టిడ్కో భవనాల లబ్ధిదారులుగా ఎంపికై.. ఇళ్లు అందని వారి తరఫున నిరాహార దీక్ష చేశారు.. ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్​ రావు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​పై ధ్వజమెత్తారు.

ayyanna comments on cm jagan
అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Dec 23, 2020, 10:57 AM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి తుగ్లక్ ఆలోచనలు మానుకోవాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో టిడ్కో భవనాల బాధితుల తరఫున నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలు, అనకాపల్లి నియోజకవర్గ లబ్ధిదారులు డిపాజిట్​ కట్టి దక్కించుకున్నారన్నారు. వీరిని కాదని విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు.. అనకాపల్లి టిడ్కో భవనాలు ఇవ్వాలని ఆలోచన చేయటం తగదని హితవు పలికారు.

విశాఖ వాసులకు ఇల్లు ఇవ్వాలని అనుకుంటే.. విశాఖలోనే నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఏ ప్రాంతంలో నివసించే వారికి.. ఆ ప్రాంతంలోనే భవనాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ ఆలోచనలు మానుకోవాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే.. స్థానికులకు జరిగే నష్టాన్ని సీఎంకు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి తెలియజేసి.. సమస్య పరిష్కరించాలన్నారు. లేకపోతే తెదేపా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యంలో ఎముకలు కొరికే చలి... 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.