ETV Bharat / state

పట్టుబడిన నాటుసారా ఎటుపోతోంది ?

నాటుసారా.. సమాజాన్ని పీడిస్తున్న చట్ట వ్యతిరేక ఉత్పత్తి. విశాఖలోని చాలా ప్రాంతాల్లో సారా కాస్తున్నప్పటికీ మన్యం కొండల్లో మాత్రం ఏరులై ప్రవహిస్తోంది. నియంత్రించడానికి చర్యలు చేపట్టినప్పటికీ యథేఛ్చగా తయారు చేస్తున్నారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు నాటుసారాను పట్టుకుని కేసులు పెడతారు. అరెస్టులు చేస్తారు. కానీ పట్టుబడిన నాటుసారా ఎటుపోతుందో పెరుమాళ్లకెరుక అన్న చందంగా ఉంది అధికారుల తీరు.

ఈటీవీ భారత్ ప్రత్యేకం : పట్టుబడిన నాటుసారా ఎటుపోతోంది ?

author img

By

Published : Oct 10, 2020, 6:42 PM IST

విశాఖ జిల్లాలో మన్యం పెదబయలు మండలం లాగబూసిలో ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అనంతరం అత్యధికంగా 740 లీటర్ల మేర నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నాటుసారా పాడేరు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

ఏం చేస్తున్నారో..

దాడుల్లో పట్టుబడిన నాటుసారాను అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. రాత్రులు సాధారణమైన వాచ్​మెన్ ఉన్నప్పటికీ పాడేరు ఎక్సైజ్ కార్యాలయంలో పెద్దగా రక్షణేదీ లేదు. మూడు వైపుల గోడల పై నుంచి చోరులు ప్రవేశించి నాటు సారా ఎత్తుకెళ్లే అవకాశం ఉంది.

పరిశీలనకు ఉదయమే..

ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈటీవీ- ఈటీవీ భారత్ ప్రతినిధి ఆబ్కారీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు, స్వాధీనం చేసుకున్న సారా మూటలు ఓ వాహనంలో ఎదురుగా ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల పనితీరు పరిశీలనలో భాగంగా ఈటీవీ ప్రతినిధి పది లీటర్ల సారా ప్యాకెట్ మూటలను వాహనం నుంచి కిందకు దించారు. అనంతరం ప్రధాన రహదారి వద్దకు తీసుకెళ్తున్నా అడిగే నాథుడే లేరు. అరగంట వరకు కార్యాలయంలోనే ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కనిపించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడతోంది.

దొడ్డిదారిన ఎత్తుకెళ్లే అవకాశం..

స్వాధీనం చేసుకున్న నాటుసారా సహా వాహనాలను చోరీలు దొడ్డిదారిన ఎత్తుకెళ్లే అవకాశం ఉన్నందున అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు పట్టుబడిన నాటుసారా వెనకనుంచి బయటకు కూడా తరలిపోతున్నట్లు పాడేరులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డివిజన్ స్థాయిలో రక్షణేదీ?

ఏది ఏమైనప్పటికీ డివిజనల్ స్థాయి ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం ఇలా రక్షణ లేకుండా ఉండటం చోరీలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ఆ పత్రికతో ముఖ్యమంత్రికి నిజాలు తెలియవు: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.