విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ వి. లక్ష్మణరావు తెలిపారు అనకాపల్లిలోని ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న వ్యసన విముక్తి కేంద్రం గదులను ఆయన పరిశీలించారు.
మద్యం, ఇతర వ్యాసనాల బారిన పడినవారికి కౌన్సిలింగ్ ఇచ్చి వీరితో వ్యసనాన్ని మానిపించేలా వైద్య చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు, డాక్టర్ సింహాచలం నాయుడు పాల్గొన్నారు.
ఇది చదవండి 'ఆర్టీసీ ఒప్పంద కార్మికులను తొలగించొద్దని ఆందోళన'