Engineering Students: విశాఖ భీమిలి బీచ్ లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతై 3రోజులైనా విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ చోసం తల్లిదండ్రులతో పాటు బంధువులు బీచ్ పరిసర ప్రాంతాల్లో నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని కనీసం మంచినీరు కూడా ఇచ్చే నాధుడే లేడంటూ బంధువులు మండిపడుతున్నారు. గత సాయంత్రం కోస్టల్ గార్డ్ నేవి బృందాలతో పాటు మత్స్యకారులు పడవల్లో గాలింపు చర్యలు చేపట్టి వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్లిపోయారన్నారు.
ఇవాళ ఏ ఒక్క ప్రయత్నము చేయకపోవడం దురదృష్టకరమని, అదే ధనవంతులు పిల్లలు అయితే ఇలాగే ప్రభుత్వం చేస్తుందా.. అని ప్రశ్నించారు. విశాఖ ఆర్కే బీచ్ లో ఓ వ్యక్తి తన భార్య గల్లంతైందని అయిందని, ఫిర్యాదు చేస్తే గాలింపు చర్యల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చివరికి అందరిని బురిడీ కొట్టించి తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్ల పిల్లలంటే అంత అలుసా అంటూ రోదించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాన్ని కనీసం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం ఏం చేయకుండానే సాయి అనే విద్యార్థి మృతదేహం సముద్ర అలలతో ఒడ్డుకు వచ్చిందని సాయి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: