విశాఖలో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోంది. ఈ నెల 13న రుషికొండ సాగరతీరంలో జరిగిన రేవ్‌పార్టీలో డ్రగ్స్ వినియోగించిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రమాదకర మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.900 గ్రాముల ఎండీఎంఏ,ఏడు ఎల్ఎస్డీ స్టిక్కర్లు, 1.9 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ద్వారకా ఏసీపీ వైవీ నాయుడు వెల్లడించారు.
పోలీసులు సీరియస్...
విశాఖ నగరంలో డ్రగ్స్ మహమ్మారిని ఆదిలోనే తరిమికొట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. బీచ్ ప్రాంతాల్లో నిర్వహించే పార్టీలకు అనుమతులను మరింత కట్టుదిట్టం చేశారు. విచ్చలవిడి పార్టీల నిర్వహణ, డ్రగ్స్ వినియోగం వంటివి వెలుగులోకి రావడంతో పర్యాటకశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించిన బీచ్ ఫ్రంట్ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఎండీఎంఏ... అత్యంత ప్రమాదకరం...
ఎండీఎంఏ... కొకైన్, హెరాయిన్ వంటి వాటితో పోల్చితే అధిక మత్తు కలిగించే పదార్థం. ఫంగస్ నుంచి తయారయ్యే ఎల్ఎస్డీ డ్రగ్ స్టిక్కర్ల రూపంలో ఉంటుంది. దీన్ని ఆస్వాదించటం ద్వారా కంటి చూపు కోల్పోయే ప్రమాదముంది. హృద్రోగ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అలర్ట్... సాగరతీరంలో మత్తు అలజడి
సువిశాల సాగరతీరంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖలోకి డ్రగ్స్ భూతాలు ప్రవేశించాయి. నిన్నటి వరకు గంజాయి మహమ్మారి నుంచి యువతను కాపాడటమే సవాలుగా ఉన్న పోసులకు... ఇప్పుడు కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి ప్రమాదకర మత్తుపదార్థాలు తలనొప్పిగా మారాయి. సాగరతీరం వేదికగా జరిగిన రేవ్‌పార్టీ డ్రగ్స్ మాఫియాను వెలుగులోకి తీసుకొచ్చింది. యువత ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్నందున డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టడంపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.