పాయకరావుపేట మండలం కుమారపురం ప్రాంతంలోని పేదలకు వైకాపా నాయకులు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు పది టన్నుల కూరగాయలు, సరుకులను ఆటోల ద్వారా తరలించారు. ఇంటింటికి తిరిగి అందించారు. వీటిని కుమారపురం, రాజగోపాలపురం, కండిపూడి తదితర 5 గ్రామాల ప్రజలు అందుకున్నారు.
పాడేరులో...
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుక్కా భవాని అనే మహిళ పాడేరు పంచాయతీ పరిసర గ్రామాల్లో గిరిపుత్రులకు సూమారు 1800 మాస్కులు పంపిణీ చేశారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
మాడుగులలో..
ముఖలింగేశ్వర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాడుగుల మండలం వొమ్మలి, జగన్నాథపురం గ్రామాల్లో హైపోక్లోరైట్ మందులు పిచికారి చేశారు.
చీడికాడ..
చీడికాడ మండలంలోని చెట్టుపల్లి గ్రామంలో వైకాపా నాయకులు, యువత సమకూర్చిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, సబ్బులు, బియ్యం ఊరందరికీ పంపిణీ చేశారు. వరహాపురంలో దొడ్డి సత్యనారాయణ అనే వ్యక్తి 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇదే గ్రామంలోని ప్రాథమిక ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు సొంత నిధులతో సమకూర్చిన సరుకులను 220 మంది విద్యార్థులకు, కుటుంబాలకు పంపిణీ చేశారు. చీడికాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పేదలకు సరకులను పంపిణీ చేశారు.
కె.కోటపాడు..
కె.కోటపాడు, ఏ.కోడూరు గ్రామాల్లో పహారా కాస్తున్న 40 మంది పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ నేతలు రోజూ ఆహారం పంపిణీ చేస్తున్నారు. గొండుడుపాలెం మాజీ సర్పంచి శ్రీను.. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందజేశారు.
దేవరాపల్లి...
దేవరాపల్లిలో ఆవుగడ్డ ఫణీంద్ర నాయుడు... ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
ఇదీ చదవండి: