విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి.. జేడీ ఫౌండేషన్ వైద్య పరికరాలు విరాళంగా అందించింది. యాభై ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్స్, ఫ్లో మీటర్లు, హ్యూమిడిఫైర్ బాటిల్స్, ఆక్సిజన్ మాస్క్‌లు పంపిణీ చేశారు. వీటివల్ల మరింత మంది రోగులకు అత్యవసర చికిత్స అందించే అవకాశం కలిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.విజయ కుమార్ చెప్పారు.
రీఫిల్ చేసుకునే సౌకర్యం ఉన్న ఆక్సిజెన్ సిలెండర్లు ఇచ్చారని… వాటి ద్వారా మేలు కలుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. వైద్య పరికరాలు అందించినందుకు జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు.
ఇదీ చదవండి: