విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలకు పోలీసులు దుస్తులు పంపిణీ చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా వారికి పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. 6వ తరగతి నుంచి 10 వరకు చదువులో ప్రతిభగల విద్యార్థులను గుర్తించి.. నగదును అందించారు. విద్యార్థులు ఏజెన్సీ సంప్రదాయ నృత్యం థింసా ప్రదర్శించారు. సీఐ బాబు వారితో కలిసి డ్యాన్స్ చేశారు. విద్యార్థుల్ని చదువులో ప్రోత్సహించేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు సొంత ఖర్చులతో నగదును అందించారని చెప్పారు. కార్యక్రమంలో సీఐ బాబు ఎస్సై ఉపేంద్ర ట్రైనీ ఎస్ఐలు శివ, రవీంద్ర, సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ ఎస్సై పాపి నాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందించేందుకు రూ.65000 నగదు ఇచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్ బ్రిజేష్ కుమార్ను అందరూ అభినందించారు.
ఇదీ చదవండి: సిక్కోలులో ఆకర్షిస్తున్న మూరెడు తోక గొర్రెలు