డైట్ మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విశాఖలో డైట్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 27వేల మంది డైట్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఉండగా... కేవలం డైట్ కౌన్సెలింగ్ రూపంలో ఉన్న విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం దుర్మార్గమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు. 27వేల మంది విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు పాలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
తల్లి బాధను కళ్లారా చూశాడు.. రక్తదానంపై అవగాహన పెంచుతున్నాడు