ETV Bharat / state

'ఆయన ప్రతిపక్షనేత కాదు.. ప్రతీకారపక్ష నేత' - దాడి వీరభద్రరావు కామెంట్స్ ఆన్ టీడీపీ

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నాయకుడు, మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు కేవలం 29 గ్రామాల అభివృద్ధినే కాంక్షిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తనను ఓడించిన రాష్ట్రప్రజలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.

Dhadi veerabadra roa on comments on chandrababu
మాజీమంత్రి దాడి వీరభద్రరావు
author img

By

Published : Jan 31, 2020, 10:24 AM IST

చంద్రబాబుపై మాజీమంత్రి దాడి వీరభద్రరావు విమర్శలు

ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రతీకార నాయకుడిగా మారారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెదేపా వ్యతిరేకమని దాడి వీరభద్రరావు ఆరోపించారు.

ఇదీ చదవండి:

'రాజీనామా చేశారు... తర్వాత ఏంటీ..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.