ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన: భౌతిక దూరం పాటించేలా చర్యలు - ETV Bharat article on no physical distance in public area

'ఈటీవీ భారత్' వార్తకు విశాఖ జిల్లా దేవరాపల్లి పోలీసులు స్పందించారు. స్థానిక మార్కెట్, బ్యాంకులు, దుకాణ సముదాయాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సింహాచలం హెచ్చరించారు.

devarapally police Response to ETV Bharat article
దేవరాపల్లిలో భౌతిక దూరం పాటించేలా చర్యలు
author img

By

Published : May 19, 2021, 10:03 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లిలో బ్యాంకులు, కూరగాయలు మార్కెట్, కిరాణ, ఇతర దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించలేదు. దీనిపై 'ఈటీవీ భారత్'​లో 'విజృంభిస్తున్న కరోనా.. విస్మరిస్తున్న భౌతికదూరం' శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై దేవరాపల్లి ఎస్సై సింహాచలం స్పందించారు. మార్కెట్, దుకాణాలు వద్ద రైతులు, ప్రజలు, వ్యాపారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన కూడలి, కిరాణా దుకాణాలు, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులను గస్తీ పెట్టారు. కర్ఫ్యూ సమయంలో రోడ్లుపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ఇదీ చూడండి..

విజృంభిస్తున్న కరోనా...విస్మరిస్తున్న భౌతికదూరం!

బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో 20 పడకలు: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.