Kolagatla Veerabhadra Swamy on Liquor : మద్యపాన నిషేధ ఆలోచన ప్రభుత్వ చర్చల దశలో ఉందని, ఆ నిర్ణయం తీసుకుంటే వంద షాపులు ఉన్నా, పది షాపులు ఉన్నా.. మూతపడక తప్పదని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధంపై నిర్ణయం ఉండే అవకాశం ఉందని విశాఖలో ఆయన తెలిపారు.
విజయనగరంలో రాత్రి అశోక్ గజపతి బంగ్లాలో బస చేసిన చంద్రబాబు కుట్రలకు, కుతంత్రాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బహిరంగ సభకు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకువచ్చారని, ఆయన మాటలను జనం నమ్మే పరిస్ధితి లేదని ఎద్దేవా చేశారు.
'సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా దృష్టిలో ఉంది. అయితే రాష్ట్ర అర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా ఇంకా మద్యం షాపులు నడుస్తున్నాయి. దీనిపై ఎన్నికలలోపు నిర్ణయం తీసుకుంటారు. విజయనగరంలో నిన్న రాత్రి అశోక్ గజపతి బంగ్లాలో బస చేసిన చంద్రబాబు రాష్ట్రంలో మళ్లీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. 1995 అశోక్ గజపతి బంగ్లాలో ఎలాగైతే కుట్రలకు తెరతీశారో మళ్లీ అదే బంగ్లాలో నిన్న బస చేశారు కనుక.. మళ్లీ ఎలాంటి కుట్రలకు తెరలేపుతారోననే అనుమానం కలుగుతోంది.' -కోలగట్ల వీరభద్ర స్వామి, డిప్యూటీ స్పీకర్
ఇవీ చదవండి: